Search form

ఫిలిప్పీయులకు 2:9-11

యేసుకు ఘనత

9-11అందుచేత పరలోకంలోనూ, భూమి మీదా,

భూమి కిందా ఉన్న ప్రతి ఒక్కరి మోకాలు యేసు నామంలో వంగేలా,

ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమ కోసం యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించేలా,

దేవుడు ఆయనను ఎంతో ఉన్నతంగా హెచ్చించి,

అందరికంటే ఉన్నతమైన నామాన్ని ఆయనకు ఇచ్చాడు.

అంతరంగంలోని రక్షణకు బాహ్య గురుతులు

12నా ప్రియ సహ విశ్వాసులారా, మీరెప్పుడూ లోబడుతున్నట్టుగానే, నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, మరి ఎక్కువగా మీతో లేనప్పుడు, భయభక్తులతో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి.

తెలుగు బైబిల్

© 2017 Bridge Connectivity Solutions. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0

More Info | Version Index